Tuesday, September 17, 2024

‘మాస్ట్రో’ బ్రాండ్ న్యూ పోస్టర్

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలవుతున్న ఈ సినిమా నితిన్‌కు ల్యాండ్ మార్క్ 30వ చిత్రం. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తే, తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ నితిన్, తమన్నా కాంబినేషన్‌లో ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని నిలబడ్డ తమన్నా ఆకట్టుకుంటున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nitin and Tamanna brand new poster out from Maestro

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News