Thursday, January 23, 2025

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

డార్జిలింగ్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్ లోని డార్జిలింగ్ లో నేషనల్ హైవేల శంకుస్థాపనకు హాజరైన సమయంలో స్టేజిపై ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు, పక్కనన్న గ్రీన్ రూమ్ లోకి ఆయనను విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి సిలిగురి నుంచి సీనియర్ డాక్టర్ ను ఆగమేఘాలపై రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో చికిత్స కొనసాగింది. ఆ తర్వాత డార్జిలింగ్ బిజెపి ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News