Thursday, January 23, 2025

తిరుపతిలో ఈవి బస్ ఫ్లీట్‌ను జెండా ఊపి ప్రారంభించిన నితిన్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తమ ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ను జెండా ఊపి ప్రారంభించటంతో కొత్త-యుగం ఇంటర్‌సిటీ EV బస్సు సర్వీస్ అయిన ఫ్రెష్ బస్సు మహోన్నత గౌరవాన్ని అందుకుంది. భారతదేశంలో సౌకర్యవంతమైన, సరసమైన, పర్యావరణ అనుకూలమైన ఇంటర్-సిటీ బస్సు ప్రయాణానికి భవిష్యత్ ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన దశను ఇది సూచిస్తుంది. బెంగుళూరు-తిరుపతి రూట్‌లో ఒక్కో సీటుకు రూ. 399 ధరతో ఇప్పటికే నడుస్తున్న ఫ్రెష్ బస్సు, తమ ప్రయాణీకులకు ప్రీమియం, పర్యావరణ అనుకూల బస్సు ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. ఈ నెలలోనే హైదరాబాద్-విజయవాడ మార్గంలో కూడా కంపెనీ తమ సేవలను ప్రారంభించనుంది.

ఫ్రెష్ బస్ కోచ్‌లు కస్టమర్ సంతృప్తి, భద్రత, సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తాయి, 45° రిక్లైన్, వ్యక్తిగత ఛార్జింగ్ డాక్స్, Wi-Fi కనెక్టివిటీ, నిజ-సమయ ట్రాకింగ్‌తో కూడిన ఖరీదైన సీటింగ్‌ అనుభవాలను అందిస్తాయి. మెరుగైన శిక్షణ, నాణ్యత తనిఖీలతో పాటుగా మద్యం, మాదకద్రవ్యాల పరీక్షలతో సహా కఠినమైన పరిశీలనను డ్రైవర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బస్సులు పునరుత్పత్తి బ్రేకింగ్, ఉష్ణోగ్రత సెన్సార్లు, CCTV నిఘా, మెడికల్ కిట్‌లు, అగ్నిమాపక యంత్రాలు, మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన పింక్ సీట్ ఫీచర్ వంటి అధునాతన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి, ప్రయాణీకులందరికీ సురక్షితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తాయి. 2 గంటల్లో 0 నుండి 100% ఛార్జ్ చేయగల సామర్థ్యంతో ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ ఫ్లీట్ గరిష్టంగా గంటకు 90 కిమీ వేగంతో 400 కిమీ వరకు ప్రయాణించగలదు.

ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… “ఎలక్ట్రిక్ బస్సుల రాక కాలుష్యం తగ్గడానికి దారి తీస్తుంది. అలాగే డీజిల్, ముడి చమురు దిగుమతిపై ఆధారపడటాన్ని కూడా తగ్గించగలుగుతుంది. పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు. కస్టమర్ అనుభవం, భద్రత, ఆవిష్కరణలపై ఫ్రెష్ బస్ యొక్క దృష్టి ప్రశంసనీయం, వారి ఎలక్ట్రిక్ ఫ్లీట్ భారతదేశంలో ఇంటర్ సిటీ ట్రావెల్ కి పచ్చదనం, మరింత సమర్థవంతమైన భవిష్యత్తు ను అందించటానికి దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను..” అని అన్నారు.

ఈ సందర్భంగా ఫ్రెష్ బస్ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా మాట్లాడుతూ.. ” దేశాభివృద్ధికి స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నందుకు గౌరవ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్రెష్ బస్సు హరిత భారతదేశం దిశగా ముందడుగు వేస్తుంది. మా ఎలక్ట్రిక్ బస్సులు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటాయి, ఇవి ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడమే కాకుండా కఠినమైన నాణ్యతా ప్రమాణాలను కూడా కలిగి ఉంటాయి. టెయిల్‌పైప్ ఉద్గారాలను తొలగించడం ద్వారా, ఈ బస్సులు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు పౌరుల మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి గణనీయంగా దోహదపడతాయి. ఒక్క ఫ్రెష్ బస్సు 90,000 లీటర్ల డీజిల్ ఒక సంవత్సరం వ్యవధిలో ఆదా చేస్తుంది. దాదాపు 200 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది . ఇది పర్యావరణంపై దాదాపు 10,000 చెట్ల ప్రభావానికి సమానం!” అని అన్నారు.

ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, గోవా, పూణే, ఇతర ప్రధాన నగరాలను కలుపుతున్న రూట్‌లతో సహా భారతదేశంలోని టాప్ 100 రూట్‌లను లక్ష్యంగా చేసుకుని ఫ్రెష్ బస్ తదుపరి దశలో తన సేవలను విస్తరించాలని యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News