Wednesday, January 22, 2025

కేంద్రమంత్రి గడ్కరీకి మళ్లీ బెదిరింపు కాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న ఆయన అధికార కార్యాలయానికి సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ‘సోమవారం అర్ధరాత్రి మంత్రిగారి అధికార కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మంత్రిగారితో మాట్లాడాలని, ఆయనను బెదిరించాలంటూ హిందీలో చెబుతూ ఫోన్ కట్ చేశాడు’ అని మంత్రి సిబ్బంది తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ‘మంత్రిగారి కార్యాలయానికి వచ్చిన అన్ని కాల్స్‌ను పరిశీలిస్తున్నాం. నిందితుడు ల్యాండ్‌లైన్‌నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించాం.దీనిపై పూర్తి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుంటాం’ అని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. గతంలలో కూడా నాగపూర్‌లోని నితిన్ గడ్కరీ కార్యాలయానికి రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ జయేశ్ పూజారి అలియాస్ కాంతా అనే వ్యక్తి ఫోన్ చేశాడు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిపి నిందితుడిపై ఉగ్రవాద నిరోధక చట్ట కింద కేసునమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News