Thursday, September 19, 2024

ప్రధాని పదవికి ఆఫర్ వచ్చింది…. నో చెప్పాను

- Advertisement -
- Advertisement -

నితిన్ గడ్కరీ వెల్లడి
నాగ్‌పూర్‌లో పాత్రికేయుల సన్మాన కార్యక్రమం
హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష నేత కలిశారని వెల్లడి

నాగ్‌పూర్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ఒక ఆసక్తికర అంశం వెల్లడించారు. ఇటీవల తనకు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, కానీ తాను అందుకు అంగీకరించలేదని గడ్కరీ తెలియజేశారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను ఒక కీలక పార్టీకి చెందిన నేత ఒకరు కలిశారని, ఇండియా కూటమిని బలపరచాలని ఆ నేత కోరారని కేంద్ర మంత్రి వెల్లడించారు. మీరు ప్రధాని అవుతామంటే మద్దతు ఇస్తామని ఆ నేత చెప్పారని గడ్కరీ తెలిపారు.

ఇండియా కూటమి గెలిస్తే తనను ప్రధానిని చేస్తానని ఆ నేత హామీ ఇచ్చినట్లు, కానీ, తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని చెప్పి ఆ నేతను పంపించివేసినట్లు గడ్కరీ వివరించారు. ప్రధానిని కావడం తన జీవిత లక్ష్యం కాదని ఆ నేతకు అర్థమయ్యేలా చెప్పానని, ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని తాను స్పష్టం చేశానని గడ్కరీ తెలియజేశారు. కాగా, తనను కలిసిన సీనియర్ నేత ఎవరు? ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అనేది మాత్రం గడ్కరీ వెల్లడించలేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పాత్రికేయుల సన్మాన కార్యక్రమంలో గడ్కరీ ఈ వివరాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News