Friday, December 20, 2024

ఖర్గే , జైరాం తప్పుడు సోషల్ వేషాలు.. కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్‌లకు లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు , అప్రదిష్ట పాలుచేసే వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ తమ లాయరు బాలేందు శేఖర్ ద్వారా ఈ నోటీసులు వెలువరించారు. సామాజిక మాద్యమం ఎక్స్ ద్వారా కాంగ్రెస్ నేతలు తమ క్లయింట్ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారని పేర్కొంటూ , వారి సామాజిక మాధ్యమ స్పందనలను వెంటనే తొలిగించుకోవల్సి ఉంటుంది. లిఖితపూర్వక క్షమాపణలకు దిగాల్సి ఉంటుంది. లీగల్ నోటీసు అందిన 24 గంటల వ్యవధిలో వీరి నుంచి తగు స్పందన లేకపోతే తాము తీసుకోబోయే తదుపరి చర్యలకు ఎదురుచూడాల్సి ఉంటుందని తెలిపారు.

కేంద్రంలో జాతీయ రహదారులు, పోర్టుల కీలక మంత్రి అయిన నితిన్ గడ్కరీ లాలన్‌టాప్ అనే వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో దేశంలో మోడీ హయాంలో రోడ్లు బాగాలేవని, మంచినీరు లేదని, ఆసుపత్రులు, విద్యాసౌకర్యాలు లేవని కేంద్ర మంత్రి గడ్కరి చెప్పినట్లు ఈ ఇరువురు నేతలు ఆయన ఇంటర్వూలోని అంశాలను వక్రీకరించారని , ఇదంతా కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ నాయకత్వంలోని బిజెపిని అప్రతిష్టపాలుచేసేందుకు చేపట్టిన చర్య అని, ఇందులో వీరు తమ క్లయింట్‌ను కించపరిచే విధంగా వ్యవహరించారని పేర్కొంటూ ఈ లీగల్ నోటీసులు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News