Monday, December 23, 2024

విఐపిల వాహనాల సైరన్ల మూత సంగీత మోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఇకపై విఐపిల వాహనాల సైరన్ల మోత నిలిచిపోతుంది. ఈ సైరన్ల చప్పుళ్ల బదులు ఇక షహనాయ్ లేదా బాసూరి సంగీతం విన్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారులు , రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. విఐపిల వాహనాల రాకపోకలకు ముందు సైరన్లుతో ఏర్పడే శబ్ధకాలుష్యం గురించి తాను పరిశీలించినట్లు, ఇప్పటికే విఐపిల వాహనాలకు

ప్రత్యేకంగా ఎరుపు లైట్ల పద్థతి తీససే అవకాశం దక్కిన తాను త్వరలోనే సైరన్లకు ముగింపు పలుకుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఘుయ్‌ఘుయ్ మనే సైరన్ల మోతకుబదులుగా విఐపి వాహనాల ద్వారా కమ్మటి సంగీతం, అది ఫ్లూట్ వాయిద్యం కావచ్చు, తబలా లేదా శంఖం చప్పుడు కావచ్చు ఏదో ఒకటి ఎంచుకుని సైరన్ల స్థానంలో వీటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం ఆయన పుణేలో చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News