Thursday, January 23, 2025

గడ్కరీ హైడ్రోజన్ కారు కలకలం

- Advertisement -
- Advertisement -

Nitin Gadkari reaches Parliament in green hydrogen-powered car

 

న్యూఢిల్లీ : కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తమ నివాసం నుంచి పార్లమెంట్ వరకూ హైడ్రోజన్ కారులో వచ్చారు. ఈ తెలుపు రంగు కారు హైడ్రోజన్ ఇంధనంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్ కారుల ప్రయోగాత్మక దశలో భాగంగా మంత్రి ఇప్పటి పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ కారును ఎంచుకున్నారు. దేశంలో పునరుత్థాన, హరిత ఇంధన పరిణామం అవసరం అని, కాలుష్య నివారణకు రవాణా రంగంలో ఇటువంటి కీలక మార్పు అత్యవసరం అని పలుసార్లు రవాణా హైవేల మంత్రి గడ్కరీ చెపుతూ వస్తున్నారు. హైడ్రోజన్ ఆధారితంగా ఈ కారు ఫుల్‌ట్యాంకు సామర్థం ఉంటే 600 కిలోమీటర్ల వరకూ వెళ్లుతుంది. పర్యావరణ హిత సంకేతంగా ఇతర కార్ల మాదిరిగానే ఈ తెల్లటి కారుపై ఆకుపచ్చ నెంబరు ప్లేటు అమర్చి ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News