హన్మకొండ: 2024 నాటికి రూ.2లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శనివారం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారు.తెలంగాణలో ఇప్పటివరకు రూ.లక్ష పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు.
నాగ్ పూర్-విజయవాడ జాతీయ రహదారికి నేడు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఉత్తరాది, దక్షిణాది అనుసంధానిస్తూ రహదారులు నిర్మస్తున్నామని పేర్కొన్నారు. సూరత్ నుంచి హైదరాబాద్, వరంగల్, కర్నూల్ మీదుగా రహదారి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణాలకు రహదారులు వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలని అన్నారు.
Also Read: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ..