Wednesday, January 22, 2025

జీవిత, వైద్య బీమాపై జిఎస్‌టి ఉపసంహరించండి: గడ్కరీ

- Advertisement -
- Advertisement -

జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై విధించిన 18 శాతం గూడ్సు అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జిఎస్‌టి)ని ఉపసంహరించాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇన్సూరెన్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నాగపూర్ విభాగం తనకు సమర్పించిన విజ్ఞాపనకు సంబంధించి గడ్కరీ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జిఎస్‌టి విధించడం అస్థిర జీవితంపై పన్ను విధించడమేనని గడ్కరీ పేర్కొన్నారు. తన కుటుంబ భద్రత కోసం అస్తిరమైన జీవితానికి బీమా కల్పించుకునే వ్యక్తి కట్టే ప్రీమియంలపై జిఎస్‌టి విధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంలపై విధించిన 18 శాతం జిఎస్‌టిని ఉపసంహరించాలని ఆయన తన లేఖలో ఆర్థిక మంత్రిని కోరారు. వైద్య బీమా ప్రీమియంలపై జిఎస్‌టి విధించడం వల్ల ఆ రంగానికి చెందిన వ్యాపార అభివృద్ధికి అవరోధం కాగలదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News