Sunday, December 22, 2024

వామ్మో… శ్రీలీలలో ఇన్ని కళలున్నాయా?

- Advertisement -
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీలీల పేరు మారుమోగిపోతోంది. పెళ్ళి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల బీజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఆమె 2024 డైరీలో కాల్షీట్లు ఖాళీ లేవంటే ఎంత బిజీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ అమ్మడు తాజాగా నితిన్ తో నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతోంది.

నితిన్, శ్రీలీలతోపాటు ఈ సినిమాలో యాంగ్రీ హీరో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. దీనికి రైటర్ వక్కంతం వంశీ దర్శకుడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీలపై నితిన్ చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ షూటింగ్ మొదలయ్యేంతవరకూ శ్రీలీల గురించి తనకు పెద్దగా తెలియదనీ, బాగా నటిస్తుందనీ, బాగా డాన్స్ చేస్తుందనీ మాత్రమే తెలుసునని చెప్పాడు. అయితే ఆమెతో షూటింగ్ మొదలైన రోజున తన గురించి అడిగితే యాక్టింగ్, డాన్సింగ్ మాత్రమే కాకుండా, అనేక రంగాల్లో శ్రీలీల టాప్ అని తెలిసిందని నితిన్ చెప్పాడు. శ్రీలీల రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్, హాకీ ప్లేయరట. కూచిపూడి, భరతనాట్యం కూడా బాగా వచ్చట. వీణ కూడా వాయిస్తుందట. ఇంత చిన్న వయసులో ఇన్ని టాలెంట్స్ ఉండటం చాలా అరుదని నితిన్ ప్రశంసించాడు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News