Sunday, February 2, 2025

ప్రధాని పదవి కోసమే బిజెపికి నితీశ్ వెన్నుపోటు

- Advertisement -
- Advertisement -

Nitish backstabbed BJP to become PM: Amit Shah

అమిత్ షా ఆరోపణ

పూర్నియా: ప్రధాన మంత్రి కావాలన్న ఆశను నెరవేర్చుకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో చేతులు కలిపి బిజెపికి వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో మొట్టమొదటిసారి రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం నాడిక్కడకు వచ్చిన అమిత్ షా బిజెపి నిర్వహించిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్‌కు ఎటువంటి సిద్ధాంతాలు లేవని, కులాధారిత రాజకీయాలకు అనుకూలంగా తన సోషలిజాన్ని ఆయన వదులుకున్నారని ఆరోపించారు. 2014లో కూడా నితీశ్ కుమార్ ఇదే పని చేశారని ఆయన అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు మహాగట్బంధన్‌ను చిత్తుగా ఓడిస్తారని, 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము సేవ, అభివృద్ధితోకూడిన రాజకీయాలు చేస్తామే తప్ప స్వార్థపూరిత, అధికారం కోసం పాకులాడే రాజకీయాలు కాదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News