Wednesday, January 22, 2025

75 శాతం కోటా పెంపునకు బీహార్ కేబినెట్ తీర్మానం

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలు, ఇబిసిలు, ఆర్థికంగా బలహీన వర్గాల( ఇడబ్లుఎస్) రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలనే ప్రతిపాదనను బీహార్ మంత్రివర్గటం మంగళవారం ఆమోదించింది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించి ఓ బిల్లును తీసుకువస్తారు. మంగళవారం సభ ముందుంచిన కులగణ సర్వే నివేదికపై చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఒబిసిలు, ఇబిసిల రిజర్వేషన్లను ఇప్పుడున్న 30 శాతంనుంచి 43 శాతానికి, ఎస్‌సిల రిజర్వేషన్లను 16 శాతంనుంచి 20 శాతానికి ఎస్‌టిల రిజర్వేషన్లను 1 శాతంనుంచి 2 శాతానికి పెంచాలని ఈ ప్రతిపాదన కోరుతోంది. కాగా ఇడబ్లుఎస్‌ల కోటా మాత్రం ఇప్పుడున్న 10 శాతం అలాగే ఉంటుంది. బీహార్‌లోని మొత్తం 13.07 కోట్ల జనాభాలో ఒబిసిలు( 27.13 శాతం), ఇబిసిల సబ్ గ్రూపులు(36 శాతం) కలిసి 63 శాతం ఉండగా, ఎస్‌సిలు, ఎస్‌టిలు కలిసి 21 శాతంకన్నా కాస్త ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో వెల్లడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News