Wednesday, January 22, 2025

శాసన మండలి ఎన్నికలకు నితీశ్ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

మండలికి తిరిగి ఎన్నిక కోసం నితీశ్ యత్నం

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర శాసన మండలికి తిరిగి ఎన్నిక కావడానికి మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వరుసగా నాలుగవ సారి మండలికి పోటీ చేస్తున్న నితీశ్ కుమార్ అధికార ఎన్‌డిఎ సీనియర్ నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వారిలో ఉప ముఖ్యమంత్రులు, బిజెపికి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, రాజీవ్ రంజన్ సింగ్ ‘లాలన్’ ఉన్నారు.

రాజీవ్ రంజన్ స్థానంలో నితీశ్ జెడి (యు) జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. నితీశ్ కుమార్‌తో పాటు ఆయన మంత్రివర్గ సహచరుడు సంతోష్ సుమన్, జెడి(యు) ఎంఎల్‌సి ఖాలిద్ అన్వర్ కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సుమన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవమ్ మోర్చా అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర శాసన మండలిలో 11 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బిజెపి తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించవలసి ఉంది. నాలుగు సీట్లకు పోటీ చేయగలమని చౌదరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News