Monday, December 23, 2024

సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా?

- Advertisement -
- Advertisement -

 

Tejaswi and Nitish

పాట్నా: బిహార్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకోనుందన్న వార్తల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. నేడు(మంగళవారం) జేడీయూ ప్రత్యేక సమావేశమైంది. సీఎం నితీష్‌ కుమార్‌ అధికారిక నివాసంలో జేడీయూ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మరోవైపు మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంట్లో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయ్యారు. లూలూ తనయుడు తేజస్వీ యాదవ్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతేగాక వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం లాలూ ఇంటికి వెళ్లారు. మరోపక్క ఇదే విషయమై బిహార్‌కు చెందిన బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో సమావేశమయ్యారు.

బిహార్‌ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. మరోవైపు  బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌తో సమావేశానికి బీజేపీ కూడా సమయం కోరింది. రాష్ట్ర కేబినెట్‌లోని మొత్తం 16 మంది మంత్రులు ఈరోజు గవర్నర్‌కు తమ రాజీనామాలను అందజేయనున్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌తో కలిసి నితీష్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నితీష్‌ కుమార్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. అదే విధంగా బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆర్జేడీ తెలిపింది.

తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ నేడు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ను కలుసుకుంటారని వినికిడి.

Bihar Composition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News