Monday, December 23, 2024

నితీశ్ సిగ్గులేని మనిషి

- Advertisement -
- Advertisement -

ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు
ప్రశాంత్ కిశోర్ నిశిత విమర్శ

రామ్‌గఢ్ (బీహార్) : జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను నిశితంగా విమర్శించారు. నితీశ్‌ను ‘సిగ్గులేని వ్యక్తి’గా అభివర్ణించిన ప్రశాంత్ కిశోర్ ఆయన బిజెపితో చేతులు కలపడం ద్వారా ముస్లింలను ‘వెన్నుపోటు పొడిచారు’ అని ఆరోపించారు. నితీశ్‌కు ఒకప్పుడు సన్నిహిత సహచరునిగా ఉన్న మాజీ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో మైనారిటీ వర్గాన్ని ఆకట్టుకోవడానికి జెడి (యు) అధినేత చేస్తున్న యత్నాలపై ప్రశ్నలకు స్పందించారు. ‘అవును, నితీశ్ నిజంగానే ముస్లింలను వెన్నులో పొడవడం ద్వారా వారికి ఎంతో చేశారు.

ముస్లింల అఖండ మద్దతుతో 2015లో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, రెందు సంవత్సరాల తరువాత బిజెపితో తిరిగి చేతులు కలిపారు’ అని కిశోర్ అన్నారు. సిఎఎపై నితీశ్‌తో బాహాటంగా వాదనకు దిగిన కారణంగా పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన జెడి (యు) మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు బీహార్ సిఎంపై ఆరోపణలు కొనసాగించారు. ‘ముస్లింల పౌరసత్వాన్ని పరిహరించబోయిన శాసనాన్ని నితీశ్ సమర్థించారు’ అని కిశోర్ ఆరోపించారు. ‘నితీశ్ కుమార్ సిగ్గు లేని మనిషి, ఆయన తీరుకు బీహార్ ప్రజలు విసుగు చెంది, ఆయనను అధికారం నుంచి దించివేయాలని కోరుకుంటున్నారు’ అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News