Friday, November 22, 2024

మోడీ కాళ్లు మొక్కి బీహార్‌ను అవమానించిన నితీష్: ప్రశాంత్ కిషోర్

- Advertisement -
- Advertisement -

తాను అధికారంలో కొనసాగేందుకు గాను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కారని సామాజిక కార్యకర్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ఆరోపించారు. జన్ సురాజ్ అనే హక్కుల ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ శుక్రవారం నాడిక్కద ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లకు మొక్కి నితీశ్ కుమార్ బీహార్ సిగ్గుపడేలా చేశారని విమర్శించారు. గతంలో నితీశ్ కుమార్‌తో పనిచేసి ఇప్పుడు ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రజలు నన్నుప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆయన వేరే వ్యక్తి. ఆయన మనస్సాక్షి అమ్ముడుపోలేదు అని కిషోర్ చెప్పారు. 2015లో జెడియు అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి వ్యూహకర్తగా పనిచేసిన కిషోర్ రెండేళ్ల తర్వాత ఆ పార్టీలో చేరారు. కొద్ది కాలానికే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

గతవారం ఢఙల్లీలో ఎన్‌డిఎ సమావేశాన్ని కిషోర్ ప్రస్తావిస్తూ రాష్ట్రానికి నాయకత్వం వహించే వ్యక్తి ఆ రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ఉండాలి. కాని మోడీ కాళ్లకు మొక్కి నితీష్ కుమార్ బీహార్ తలదించుకేలా చేశారు అని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలలో నితీష్ కుమార్ సారథ్యంలోని జెడియు 12 స్థానాలను గెలుచుకుంది. లోక్‌సభలో మెజారిటీని సాధించుకోలేకపోయిన బిజెపికి ఎన్‌డిఎ కూటమిలోని మిత్రపక్షాలలో రెండవ అతిపెద్ద పార్టీగా జెడియు అవతరించింది. మూడవ సారి మోడీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నట్లు జోరుగా ప్రచారం జరిగిందని, అయితే బీహార్ ముఖ్యమంత్రి తన పరపతిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారని కిషోర్ ప్రశ్నించారు.

తన పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగగేందుకు బిజెపి మద్దతు కోసం ఆయన తాపత్రయపడుతున్నారని, ఇందుకోసం మోడీకి పాదనమస్కారాలు కూడా చేయడానికి వెనుకాడడం లేదని కిషోర్ ఆరోపించారు. 2014లో మోడీ కోసం లోక్‌సబ ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తించి వార్తల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ 2021లో రాజకీయ వ్యూహకర్త అవతారం చాలించారు. అంతకుముందు ఆయన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డితోసహా పలువురు నేతలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News