Monday, December 23, 2024

ఇక విపక్ష భేటీ తేదీ బాధ్యత కాంగ్రెస్‌దే: నితీశ్

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఈ నెల 12న పాట్నాలో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల భారీ స్థాయి సమావేశం వాయిదా పడ్డ తరువాత సోమవారం బీహార్ సిఎం జెడియూ నేత నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది త్వరలో ఖరారు అవుతుందన్నారు. కాంగ్రెస్, మరో పార్టీ 12వ తేదీ భేటీ తమకు అనువుగా లేనందున దీనిని వాయిదా వేయాలని కోరాయని నితీశ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఇతర పార్టీల నేతలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్య తేదీని ఖరారు చేయాల్సి ఉందని, దీనిని ఆ పార్టీ నేతలకు తాను తెలిపినట్లు నితీశ్ ఇక్కడ ఓ సమావేశం నేపథ్యంలో విలేకరులకు చెప్పారు.

అందరిని సంప్రదించిన తరువాత ప్రతిపక్ష భేటీ ఉంటుంది. అయితే సమావేశం ఎప్పుడు జరిగినా పార్టీల అధ్యక్షులే స్వయంగా హాజరు కావాలనేదే తమ స్పష్టమైన వైఖరి అని తెలిపారు. ప్రతిపక్ష భేటీ జరిగే తేదీ ఖరారు ఇక కాంగ్రెస్‌పై ఉంటుందని తెలిపిన నితీశ్ పార్టీల ఇతర నేతలు హాజరైతే తను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News