Monday, January 20, 2025

విపక్షాలు పరిగణిస్తే నితీశ్ బలమైన ప్రధాని అభ్యర్థి అవుతారు

- Advertisement -
- Advertisement -

Nitish Kumar could be 'strong candidate' for PM: Tejashwi

ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదుగుతారనే వాదనల నేపథ్యంలో ఆర్‌జెడి నేత, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు పరిగణనలోకి తీసుకుంటే జెడి(యు) నేత నితీశ్ కుమార్ తన సద్భావనతో బలమైన ప్రధాని అభ్యర్థిగా ఎదగగలరని ఆయన అన్నారు. బీహార్‌లో మహాకూటమి అధికారంలోకి రావడంతో జంగిల్‌రాజ్ తిరిగి వచ్చిందంటూ బిజెపి చేస్తున్న వాదనలను తిప్పికొట్టారు తేజస్వి యాదవ్. ఆ పార్టీ నేతలు అలిసిపోయి నక్కజిత్తులను ప్రదర్శిస్తున్నారన్నారు. జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్, ఇతర పక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఐక్యతకు నిదర్శనమన్నారు.‘ చాలా ప్రతిపక్షాలు దేశం ముందున్న పెద్ద సమస్యను గుర్తించాయి. అది బిజెపి ఆధిపత్యం. డబ్బు, మీడియా,ప్రభుత్వ ఏజన్సీల బలంతో చలాయించే ఆధిపత్యాన్ని భారతీయ సమాజం, రాజకీయాలనుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. వారు సహకార సమాఖ్య విధానంపై మాట్లాడుతున్నారు.ప్రాంతీయ అసమానతలను బిజెపి విస్మరిస్తోంది.

ఈ విషయంపై బీహార్ ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వూలో తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా నితీశ్ సరైన వ్యక్తి అని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తేజస్వి తనదైన శైలిలో సమాధానమిస్తూ ‘ ఈ ప్రశ్నను గౌరవ నితీశ్‌జీకే వదిలిపెడుతున్నాను. మొత్తం విపక్షాల తరఫున నేను మాట్లాడలేను. కానీ వారు పరిగణనలోకి తీసుకున్నట్లయితే నితీశ్‌జీ కచ్చితంగా బలమైన అభ్యర్థి అవుతారు. ఆయనకు 37 ఏళ్ల పార్లమెంటరీ, పరిపాలనా అనుభవం ఉంది. అంతేకాదు క్షేత్రస్థాయిలో మంచిపేరు ఉంది’ అని అన్నారు. విపక్షాలు, ఇతర ప్రగతిశీల పార్టీలు తమ సంకుచిత ప్రయోజనాలు, నష్టాలను పక్కన పెట్టి ఆలోచించి దేశాన్ని కాపాడాలి. ఇప్పటికే పట్టాలెక్కిన విధ్వంసాన్ని ఆపకపోతే దేశాన్ని పునర్నిర్మించడం చాలా కష్టమవువుతుంది’ అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News