Wednesday, February 26, 2025

నితీశ్ మంత్రివర్గం విస్తరణ

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఏడుగురు కొత్తవారితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. వారంతా కూటమి భాగస్వామ్య పక్షం బిజెపికి చెందినవారే. పాట్నాలోని రాజ్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఏడుగురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 36కు పెరిగింది. మంత్రులుగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో జీబేష్ కుమార్, సంజయ్ సరావోగి, సునీల్ కుమార్ రాజు కుమార్ సింగ్, మోతీ లాల్ ప్రసాద్, విజయ్ కుమార్ మండల్, కృష్ణ కుమార్ మంతు ఉన్నారు. బుధవారం ఉదయం బీహార్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్ ‘ఒక వ్యక్తికి ఒక పదవి’ అన్న పార్టీ విధానాన్ని పురస్కరించుకుని మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News