Friday, December 20, 2024

పికె చెప్పేదంతా పనికిమాలిన చెత్త

- Advertisement -
- Advertisement -

Nitish kumar fires on Prashant kishor

నితీశ్ కుమార్ మండిపాటు

పాట్నా: తాను ఇంకా బిజెపితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పికె) చేసిన వ్యాఖ్యలను పనికిమాలిన చెత్తగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభివర్ణించారు. అవసరమైతే బిజెపితో మళ్లీ పొత్తుకు కూడా తాను సిద్ధమేనంటూ ప్రశాంత్ కిశోర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ స్పందిస్తూ దీనిపై తాను ఏమి మాట్లాడాలని, అతను(ప్రశాంత్ కిశోర్) ఇలాంటి పనికిమాలిన చెత్తంతా మాట్లాడుతుంటాడని మండిపడ్డారు. కేవలం ప్రచారం కోసమే అతను ఇలాంటి ప్రకటనలు చేస్తుంటాడని, ఏ పార్టీ కోసం అతను పనిచేస్తున్నాడో అందరికీ తెలుసని నితీశ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News