ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం లో భాగస్వామి అయిన నితీశ్‌కుమార్ నేతృత్వం లోని జేడీ(యు) పార్టీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40 స్థానాల్లోనైనా పోటీ చేయడానికి నిర్ణయించింది. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పీడిపి సంకీర్ణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా 2018లో ఈ ప్రభుత్వం పడిపోయింది. ఎన్డీయేలో భాగస్వామి కావడంతో తమ పార్టీలో చాలా మంది చేరుతున్నారని జేడీ(యు)కు చెందిన అధికార ప్రతినిధి షాహీన్ చెప్పారు.
తమ కమిటీలను తిరిగి వ్యవస్థీకరించడం ప్రారంభించామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, బీజేపీ కీలకమైన రాజకీయ పార్టీలుగా ఉంటున్నాయి. జమ్ముకశ్మీర్‌లో తమ పార్టీకి ఇదివరకే ఉనికి ఏర్పడిందని, కానీ నాయకత్వ సమస్యల కారణంగా కుప్పకూలిందన్నారు. 201819 పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసిందని, ప్రస్తుతం సర్పంచ్‌లు, మున్సిపల్ కమిటీ సభ్యులుగా 100 మంది ఉన్నారని చెప్పారు.