Thursday, January 23, 2025

ప్రతిపక్షాల సమావేశ ఏర్పాట్లలో నితీశ్ కుమార్ బిజీ బిజీ

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగనున్న 17 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లును బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

సమావేశానికి వచ్చే విఐపిలు బసచేయనున్న రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, పాట్నా సర్కూట్ హౌస్‌ను ఆదివారం నితీశ్ తనిఖీ చేశారు. గాంధీ మైదానంలో ఉన్న జ్ఞాన్ భవన్‌లో ప్రతిపక్షాల సమావేశం జరగనున్నది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశం ఘనవిజయం సాధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆయన సంబంధింత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశానికి హాజరుకానున్న ప్రతిపక్ష నాయకులలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి, సీతారాం ఏచూరి, డి రాజా ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి వస్తున్నట్లు నాయకులందరూ సమ్మతి తెలిపారని బీహార్ ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు. సమావేశానికి హాజరయ్యే వారిలో అత్యధికులు అదేరోజు తిరు

గుప్రయాణం అయే అవకాశం ఉన్నప్పటికీ ఆతిథ్యం విషయంలో ఎక్కడా కొరత ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడడంపై ఈ సమావేశంలో ప్రతిపక్షాల నాయకులు చర్చలు జరుపుతారు. ఎన్‌డిఎ అభ్యర్థిపై ప్రతిపక్షాలకు చెందిన ఒకే అభ్యర్థి పోటీచేయాలన్న తన ప్రతిపాదనను నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రస్తావించారు. ఈ సమావేశంలోనే సీట్ల పంపకం ఫార్ములాను కూడా చర్చించనున్నారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 11, హిమాచల్ ప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 26, కర్నాటకలో 28, అస్సాంలో 14, హర్యానాలో 10, ఉత్తరాఖండ్‌లో 5 స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 147గా ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో 42, జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బెంగాల్‌లో బిజెపితో తృణమూల్ కాంగ్రెస్ ముఖాముఖీ తలపడుతుండగా, జార్ఖండ్ జెఎంఎం, బిజెపి మధ్య పోటీ ఉంది. బీహార్‌లోని 40 స్థానాలలో మహాగటబధన్‌కు బిజెపికి మధ్య పోరు ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలుండగా బిజెపికి ఎస్‌పికి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలుండగా బిజెపి-శివసేన(షిండే గ్రూపు)కు కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)కు మధ్య ప్రధాన పోటీ ఉంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలు, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలలో బిజెపి, ఆప్ మధ్య పోటీ ఉంది. బిజెపితో ప్రాంతీయ పార్టీలు మొత్తం 244 లోక్‌సభ స్థానాలలో తలపడుతున్నాయి.

తమిళనాడు(39), కేరళ(20) రాష్ట్రాలలో బిజెపి రంగంలో లేదు. ఈ కేరళలో కాంగ్రెస్‌కు, వామపక్షాలకు మధ్య, తమిళనాడులోని డిఎంకెకు అన్నాడిఎంకెకు మధ్య పోటీ ఉంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య ముక్కోణపు ఉండనున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలలో పోటీ ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగు దేశం పార్టీ, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండనున్నది. ఒడిశాలో కాంగ్రెస్, బిజెపితో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతా దళ్ తలపడనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News