Thursday, December 19, 2024

పెర్త్ టెస్టు.. భారత జట్టులోకి నితీష్ రెడ్డి?

- Advertisement -
- Advertisement -

ముంబై : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి టెస్టు నవంబర్ ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు ఇప్పటికే పెర్త్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. తొలి టెస్టు తుది జట్టులో నితీష్‌కు అవకాశమివ్వాలని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే నితీష్‌కు జట్టు మేనెజ్‌మెంట్ తెలియజేసినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ తీవ్రంగా చేస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కూడా దూరమయ్యారు.

ఈ క్రమంలోనే నితీష్ అరంగేట్రానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన నితీశ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్బుత ప్రదర్శన చేశాడు. దీంతో అతడికి భారత టి20 జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 74 పరుగులతో సత్తాచాటాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధాకరిక టెస్టులో కూడా నితీష్ భారత-ఎ జట్టు తరపున 47 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 779 పరుగులతో పాటు 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News