Wednesday, January 15, 2025

మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన నితీశ్ రెడ్డి.. వీడియో వైరల్‌

- Advertisement -
- Advertisement -

టీమిండియా యువ క్రికెటర్ నితిశ్ కుమార్ రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాడు. అందుకు కారణం లేకపోలేదు.. నితీశ్ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఇండియాకు వచ్చిన నితిశ్.. సోమవారం రాత్రి మెట్లమార్గంలో వెళ్లి తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్.. మోకాళ్లపై మెట్టు ఎక్కుతూ పైకి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో వీడియో వైరల్ గా మారింది.

కాగా, ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల్లో బ్యాటింగ్ తో రాణించాడు నితీశ్. అరంగ్రేటం మ్యాచ్ లోనే అతను సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే టీ20 సిరీస్ కు బీసీసీఐ నితీశ్ ను సెలక్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News