Friday, December 20, 2024

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

Nitish Kumar

24న బలపరీక్షకు సిద్ధం కండి!

పాట్నా: బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏతో తెగ‌దెంపులు చేసుకుని కొత్త‌గా కాంగ్రెస్‌, ఆర్జేడీతో జ‌ట్టు క‌ట్టిన జెడియూ అధినేత‌, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ నెల 24న ఆ రాష్ట్ర అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకోనున్నారు. ఈ మేర‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ ఫ‌గ్గూ చౌహాన్ గురువారం కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24 నూత‌న స‌ర్కారు త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల‌ని ఆయ‌న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ను ఆదేశించారు. తాజాగా బిజెపిని వదిలేసిన ఆయ‌న తిరిగి ఆర్జేడితో పాటు కాంగ్రెస్‌, మ‌రో 5 పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నారు. త‌న‌కు మెజారిటీ ఎమ్మెల్యేల బల‌ముంద‌ని గ‌వర్న‌ర్‌కు తెలిపిన నితీశ్ బుధ‌వారం ఆర్జేడీ అగ్ర నేత తేజ‌స్వీ యాద‌వ్‌తో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా గ‌వర్న‌ర్ ఆదేశాల‌తో ఈ కొత్త ప్ర‌భుత్వం ఈ నెల 24న త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News