Thursday, January 23, 2025

‘నితీశ్ కుమార్ ఊసరవెల్లి’

- Advertisement -
- Advertisement -

పాట్నా: రాజకీయ కూటములను పలుమార్లు మార్చడంలో జెడియు అధినేత నితీశ్ కుమార్ ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ  చురకలు అంటించింది. జెడియు అధినేత నితీశ్ కుమార్ బిజెపితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తమకు ముందే తెలుసునని ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.  ఆర్ జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్ ముందే చెప్పారని, నితీశ్ లాంటి ‘ఆయారామ్ గయా రామ్’ మనుషులు చాలా మంది  ఉన్నారని  ఎద్దేవా చేశారు.

బిహార్ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా నితీశ్ కుమార్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రధాని నరేంద్ర మోడీతో సహా బిజెపి నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు బిజెపి రాజకీయం చేస్తుందని జైరామ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News