Monday, December 23, 2024

‘ఉప రాష్ట్రపతి పదవిని కోరిన నితీశ్’

- Advertisement -
- Advertisement -

Nitish Kumar wanted to become vice president

పట్నా: బిహార్ సిఎం నితీశ్ ఉప రాష్ట్రపతి అవ్వాలనుకున్నారని బిజెపి సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోడి తెలిపారు. దీనికి బిజెపి సుముఖత వ్యక్తంచేయకపోవడంతోనే ఆయన ఎన్డీయే నుంచి వైదొలిగారని సుశీల్‌కుమార్ బుధవారం ఆరోపించారు. ఉప రాష్ట్రపతి పదవిని ఆశించి భంగపడిన నితీశ్ ఆగ్రహంతో బిజెపి కూటమిని వదిలేశారన్నారు. నితీశ్ ఆశయం నెరవేరకపోవడంతో ఎన్డీయే కూటమిని వీడి యుపిఎ కూటమితో జత కట్టారన్నారు. కాగా బిహార్ మాజీ సిఎం సుశీల్‌కుమార్ మోడి జెడియు ఖండించింది. జెడియు జాతీయ రాజీవ్ రంజన్‌సింగ్ మాట్లాడుతూ సుశీల్‌ను ఆయన సొంతపార్టీనే విస్మరించిందన్నారు. నితీశ్‌కుమార్‌తో సన్నిహితంగా సుశీల్‌కుమార్‌ను బిజెపి నడిరోడ్డుపై వదిలేసిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News