Monday, January 20, 2025

నితీశ్ కుమార్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు 3 మంత్రి పదవులు

- Advertisement -
- Advertisement -

Nitish Kumar's Govt gives 3 Ministerial berth to Congress

పాట్నా: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం లోని మహా గడ్బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయి. బీహార్ ఎఐసిసి రాష్ట్ర ఇన్‌ఛార్జి భక్త చరణ్ దాస్ ఆదివారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగస్టు 16న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని, మరో కాంగ్రెస్ శాసనసభ్యుడు మరోసారి కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. అయితే, ఎవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారో సోమవారం నిర్ణయిస్తామని భక్త చరణ్‌దాస్ పేర్కొన్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌కు మంత్రివర్గంలో కనీసం నాలుగు మంత్రి పదవులతోపాటు అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా దక్కుతాయని కాంగ్రెస్ వర్గాలు ఆశించాయి.

అయితే స్పీకర్ పదవిని ఆర్‌జెడికి కేటాయించగా, కాంగ్రెస్‌కు మూడు మంత్రి పదవులు ఖరారయ్యాయి. జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపిఐఎంఎల్(ఎల్), సీపీఐ, సీపీఎం, హెచ్‌ఏఎం పార్టీలతో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడింది. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 160 మంది ఎమ్‌ఎల్‌ఎల బలం ఈ కూటమికి ఉంది. గత బుధవారం నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Nitish Kumar’s Govt gives 3 Ministerial berth to Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News