Saturday, November 23, 2024

బిజెపిని వెన్నుపోటు పొడిచి లాలూ ఒడిలో కూర్చున్నాడు నితీశ్: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

 

Amit Shah

పాట్నా:  రాష్ట్రంలో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నుండి సిఎం నితీష్ కుమార్ విడిపోయిన తర్వాత బీహార్‌లో తన మొదటి పర్యటనలో, కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ నితీశ్ కుమార్ ప్రధాని కావాలనే తపనతో బిజెపిని వెన్నుపోటు పొడిచారని,  ఆర్ జెడి, కాంగ్రెస్ తో చేతులు కలిపారని అన్నారు.

“నితీష్ కుమార్‌కు ఎలాంటి సిద్ధాంతాలు లేవు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ‘మహాగట్  బంధన్’ తారుమారు అవుతుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.  బీహార్ సిఎంకు ఒకే ఒక లక్ష్యం ఉందని… అది తన గద్దె పదిలంగా ఉండాలన్నది’’ అని షా చెప్పుకొచ్చారు.

షా  ఇంకా  ‘‘నితీష్ కుమార్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారు. నితీష్ కుమార్‌కి సీమాంచల్ తగిన బుద్ధి చెబుతుంది’’ అన్నారు. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీశ్ ప్రధాని కాగలరా?’’ అని ప్రశ్నించారు. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో తన రెండు రోజుల పర్యటనలో ఉన్న షా, ఎంపీలు, ఎమ్మెల్యేలు , పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News