Saturday, January 4, 2025

నితీశ్ రెడ్డికి కెరీర్ బెస్ట్ ర్యాంకు

- Advertisement -
- Advertisement -

ఏకంగా 20 పాయింట్లు మెరుగుపరుచుకొని 53వ ర్యాంకుకు ఎగబాకిన యువ బ్యాటర్
బౌలింగ్‌లో బుమ్రానే టాప్

దుబాయి: బాక్సింగ్ డే టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్ సెంచరీ(114)తో భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి టెస్టు ర్యాకింగ్‌లో సంచలనం రేపాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నితీశ్.. తన కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 528 మెరుగుపరుచుకొని ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ 854 పాయింట్లు మెరుగుపరుచుకొని ఒక ర్యాంక్ 5 నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు.

ఇక టెస్టులో పేలవ ప్రదర్శన చేస్తున్న సారథి రోహిత్ శర్మ 40వ ర్యాంక్‌కు దిగజారాడు. కాగా, రోహిత్ గత ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగుల చేశాడు. పరుగుల యంత్రం, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మూడు స్థానాలు దిగజారి 24వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు జోరూట్ 895 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రూట్ తరవాతి స్థానంలో 876 పాయింట్లతో హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (867) మూడో స్థానంలో నిలిచాడు. కాగా, యశస్వి జైశ్వాల్ తప్ప మరే ఇండియన్ బ్యాటర్ టాప్ 20లో లేకపోవడం గమనార్హం. బౌలింగ్ విభాగంతో భారత సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంకు కాపాడుకున్నాడు. బుమ్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకూ 30 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్‌గా కొనసాగుతుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News