ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి సత్తా ఎంటో చూపించాడు నితీశ్ కుమార్ రెడ్డి. మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నితీశ్ కుమార్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. 2008లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అనిల్ కుంట్లే 87 పరుగులు చేశాడు. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో నితీశ్ కుమార్ 176 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో అజేయంగా 105 పరుగులు చేసి.. కుంబ్లే రికార్డును కొట్టాడు.
ఆస్ట్రేలియాలో టెస్టుల్లో 8వ స్థానంలో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా ప్లేయర్స్
నితీష్ కుమార్ రెడ్డి(105) – మెల్బోర్న్, 2024
అనిల్ కుంబ్లే(87) – అడిలైడ్, 2008
రవీంద్ర జడేజా(81) – సిడ్నీ, 2019
శార్దూల్ ఠాకూర్(67) – బ్రిస్బేన్, 2021
కర్సన్ ఘవ్రి(64) – సిడ్నీ, 1978
టెస్టుల్లో ఆస్ట్రేలియాతో 8వ ర్యాంక్‌లో అత్యధిక స్కోరు చేసినవారు
వృద్ధిమాన్ సాహా(117) – రాంచీ, 2017
నితీష్ కుమార్ రెడ్డి(105 నాటైౌట్) – మెల్బోర్న్, 2024
ఎంఎస్ ధోని – మొహాలీ(92 ), 2008
అనిల్ కుంబ్లే – అడిలైడ్(87), 2008
కపిల్ దేవ్ – చెన్నై(83), 1979