Monday, December 23, 2024

రాజ్యసభ అభ్యర్థిగా నితీశ్ నమ్మకస్తుడు సంజయ్ ఝా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీ మంగళవారం రాజ్యసభ అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు నమ్మకస్తుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఝా పేరును ప్రతిపాదించింది. బీహార్ నుంచి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంజయ్ ఝా పేరును పార్టీ అధ్యక్షుడైన నితీశ్ కుమార్ ప్రతిపాదించారని జేడీ (యు) ప్రకటనలో పేర్కొంది. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

పాలక ఎన్‌డిఎ ఈ స్థానాల్లో కనీసం మూడైనా విజయం సాధిస్తాయని నమ్ముతోంది. ఎన్‌డిఎ భాగస్వామ్య బీజేపీ ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదించింది. మాజీ మంత్రి అయిన సంజయ్ ఝా సుదీర్ఘకాలంగా నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నారు. అలాగే బీజేపీతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఝా మిథిలాంచల్ రీజియన్‌కు చెందిన వారు. రాజ్యసభ సభ్యునిగా ఇంతవరకు ఉన్న బసిష్ట నారాయణ్ సింగ్ స్థానాన్ని సంజయ్ ఝా భర్తీ చేస్తారు. నారాయణ్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News