Friday, December 20, 2024

నివేదాలో ఇంత టాలెంట్ ఉందా..

- Advertisement -
- Advertisement -

సినిమాల్లో తన గ్లామర్ తో ఆకట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నివేదా టాలెంట్ ను చూసి నెటిజన్లతోపాటు ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమో అనుకున్నాం.. కానీ తనలో ఇంత టాలెంట్ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల చెన్నైలో స్టేట్ లెవల్ బ్యాడ్మిటన్ చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మధురై తరుపున నివేదా డబుల్స్ ఆడింది. ఆడటమే కాదు.. ఏకంగా కప్పునే సాధించింది ఈ అమ్మడు.

ఈ పోటీల్లో తను గెలిచిన కప్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది నివేదా. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చేసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. నివేదాలో ఇంతా టాలెంట్ దాగి ఉందా.. నమ్మలేకపోతున్నాం.. సూపర్ అంటూ నెటిజన్స్ కాంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా, నివేదా బ్యాడ్మింటన్ ప్లేయరే కాదు.. కారు రేసర్ కూడా. ఫార్ములా కార్ రేసులో పాల్గొని ఇప్పటికే చాలా పథకాలు గెలుచుకుంది. తెలుగులో ఈ అమ్మడు.. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, రెడ్, పాగల్, అల వైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ వంటీ సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం నివేదా పేతురాజ్ పలు సినిమాలతో బిజీగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News