Thursday, January 23, 2025

యథాతథ ఒప్పందం…

- Advertisement -
- Advertisement -

నిజాం ప్రతినిధుల సంప్రదింపులు
అక్టోబర్ 8, 1947 తేదీన భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ నిజాం ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
ప్రతినిధి బృంద సభ్యులు
చత్తారి నవాబు నిజాం ప్రధాని
సర్‌వాల్టన్ నిజాం సలహాదారుడు
అలీయావర్‌జంగ్ న్యాయశాఖ కార్యదర్శి
సర్ సుల్తాన్ అహమ్మద్ ఎంఐఎం సభ్యుడు.
ఈ ప్రతినిధుల బృందం అక్టోబర్ 8న ఢిల్లీలో భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్‌ను కలిసి చర్చలు జరిపింది.
మౌంట్‌బాటన్ సలహాపై హైదరాబాద్ ప్రతినిధుల బృందం భారత ప్రభుత్వంతో ఒక ఏడాది గడువుతో కూడిన యధాతధ ఒప్పందం కుదుర్చు కోవడానికి సిద్దమయ్యారు.
లార్డ్ మౌంట్‌బాటన్ సూచనలో యధాతధ ఒప్పందం ప్రతిని నిజాం సలహాదారుడు సర్ వాల్టన్ తయారు చేశారు.
తర్వాత భారత ప్రభుత్వం సవరణలు చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నది.
1947 అక్టోబర్ 18న ఒప్పంద ముసాయిద దయారైంది.
1047 అక్టోబర్ 22న ప్రతినిధుల బృందం ముసాయిదాను ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తీసుకొచ్చింది.
యధాతధ ఒప్పందం ముసాయిదాను పరిశీలించడానికి ప్రభుత్వ ఎగ్జిక్యూటి వ్ కౌన్సిల్‌కు నిజాం అప్పగించాడు.
ఈ కౌన్సిల్ దీనిని ఆమోదించింది.
1947 అక్టోబర్ 25న నిజాం మౌఖికంగా తన అంగీకారాన్ని తెలిపాడు. కాని సంతకం చేయలేదు.
యధాతధ ఒడంబడికను కాసీంరజ్వీ వ్యతిరేకించాడు.
1947, అక్టోబర్ 28న కాశీం రజ్వీ అనుచరులు, రజాకార్లు చర్చల కోసం నియమించబడిన ప్రతినిధుల ఇండ్లను చుట్టు ముట్టి వ్యతిరేకిస్తూ ఆందోలన చేశారు.
కొత్త ప్రతినిధుల బృందం
నిజాం రాజు కరాచీ (పాకిస్థాన్) పంపిన ఇద్దరు ప్రతినిధులు అక్టోబర్ 29-, 1947న హైదరాబాద్‌కు తిరిగి వచ్చి పాకిస్థాన్ మద్దతును తెలియజేశారు.
అక్టోబర్ 31, 1947న నిజాం రాజు ఢిల్లీలో లేఖను పంపించారు.
భారత్‌తో చర్చలు విఫలమైతే వెంటనే పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవాలి!
ఈ చర్చల కోసం నియమించబడిన బృంద కమిటీ:
1. మోయిన్ నవాబ్ జంగ్ పోలీసు మంత్రి
2. పింగళి వెంకట్రామిరెడ్డి ఉపప్రధాని
3. అబ్ధుల్ రహీం.
మజ్లిస్‌తో నిజాంకు ఉన్న ఇబ్బందుల ను గమనించి యధాతథ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌కి రాయితీలివ్వడానికి భారత ప్రభుత్వాన్ని ఒప్పంచిన ట్లు లార్డ్ మౌంట్‌బాటన్ పేర్కొన్నారు.
నోట్: 1947 నవంబర్ 1న నిజాం ప్రధాని చత్తారినవాబు రాజీనామ చేయగా, అతని స్థానంలో హైదరాబాద్ ప్రధానిగా మొహిదియార్‌జంగ్ నియమించబడ్డాడు.
కాసీం రజ్వీని ఢిల్లీకి పిలిచి హైదరాబాద్ విషయమై రెఫరెండం ప్రతిపాధించినవారు.
1. సర్ధార్ వల్లభాయ్ పటేల్ (భారత హోం మంత్రి)
2. వి.పి మీనన్ (సంస్థాన వ్యవహారాల కార్యదర్శి).
కాసీం రజ్వీ తీవ్రంగా స్పందిస్తూ కత్తితో సమాధానం చెప్తామని హెచ్చరించారు.
నవంబర్ 29, 1947న నిజాం యథాతథ ఒప్పందంపై సంతకం చేశారు.
యథాతథ ఒప్పందం
ఒప్పందం జరిగిన తేది 1947, నవంబర్ 29
ఒప్పందం గడవు ఏడాది
నాటి నిజాం ప్రధాని మెహిదియార్ జంగ్
యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసినవారు:
1. లార్డ్ మౌంట్ బాటన్ (భారత గవర్నర్ జనరల్)
2. మీర్ ఉస్మాన్ అలీఖాన్ (హైదరాబాద్ నిజాం)
భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్‌లో నియమించబడింది కె.ఎం మున్షీ
హైదరాబాద్ ఏజెంట్ జనరల్‌గా ఢిల్లీలో నియమించబడిన వారు జైన్ యార్ జంగ్
నవంబర్ 29, 1947న నిజాం ప్రధాని మొహిదియార్‌జంగ్ రాజీనామా చేశాడు.
నవంబర్ 30, 1947న హైదరాబాద్ నూతన ప్రధానిగా భాద్యతలు స్వీకరించినది మీర్ లాయఖ్ అలి.
ఒప్పంద అంశాలు
ఈ ఒడంబడిక కోసం నిజాం తరపున ఢిల్లీకి వెళ్లిన ప్రతినిధులు :
1. మోయిన్ నవాబ్ జంగ్
2. అబ్దుల్ రహీం
3. పింగళి వెంకట్రామిరెడ్డి
1947 ఆగస్టు 15కు ముందు నిజాంకు, బ్రిటన్‌కు మధ్య ఉన్న అన్ని ఒప్పందాలను యథాతథంగా నిజాం భారత ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా కొనసాగించడం.
హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌కు అనుబంధ రాజ్యాంగం ఉంటుంది.
ఒక ఏడాదిలోపు హైదరాబాద్ ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం ఏర్పడాలి.
నిజాం తన రాజ్యాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయకూడదు.
ఒక వేళ భారత్ పాక్ యుద్ధం వస్తే నిజాం తటస్థంగా ఉండాలి.
హైదరాబాద్ రాజ్యంలో భారత కరెన్సీ అమలులో ఉంటుంది.
భారతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలను నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
హైదరాబాద్ రాజ్యం రక్షణ, రవాణా విదేశీ వ్యవహారాలు కేంద్రం పరిధిలో ఉంటాయి.
జైళ్లలో నిర్భందించబడిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలి.
హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
ఈ ఒప్పందాన్ని పరిశీలించేందుకు ఇద్దరు ప్రతినిధులు హైదరాబాద్, ఢిల్లీలో నియమించుకోవచ్చు.
నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా కె.ఎం మున్షీ నియమితులైనారు.
ఢిల్లీలో నిజాం రాజ్య ప్రతినిధిగా నియమితులైనవారు జెయిన్ యార్‌జంగ్
ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాలంటూ నిజాం రాజుపై ఒత్తిడి తెచ్చినది ఖాసీం రజ్వి
ఇతను తనకు అనుకూలమైన కొందరి ని ఉన్నత పదవుల్లో నియమించాడు.
1. మీర్ లాయక్‌అలీ నిజాం చివరి ప్రధాని
2. రాజ్ బహదూర్ పింగళి వెంకట్రామిరెడ్డి పోలీస్ వ్యవహారాల పర్యవేక్షణ
3. అహ్మద్ ఎల్‌డ్రూస్ సర్వసైన్యాధిపతి వీరి సహాయంతో ఖాసీం రజ్వీ ఒప్పంద ఉల్లంఘన చేశాడు.
మీర్ లాయక్ అలీ మంత్రివర్గం
నవంబర్ 29, 1947న నిజాం ప్రధా ని మెహిదియార్‌జంగ్ రాజీనామా చేయడంతో, 1947 నవంబర్ 30న హైదరాబాద్ ప్రధానిగా నియమించబడినవారు మీర్ లాయక్ అలీ.
1947 డిసెంబర్ 18న నిజాం తన మంత్రి మండలిని రద్దు చేసి మీర్ లాయఖ్‌అలీ నాయకత్వంలో నూతన మంత్రి వర్గంను ప్రకటించారు.
w ఇందులో నలుగురు హిందువులు ప్రాతినిద్యం కల్పించారు.

 

ఉల్లంఘనలు

సంస్థానంలో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయలేదు.
భారతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆంక్షలు విధించారు.
భారత కరెన్సీ తన రాజ్యంలో చెల్లదని నిజాం ప్రకటించాడు.
పోర్చుగీసు వారి నుండి గోవాను, సికింద్రాబాద్ నుండి హకీంపేట విమానాశ్రయాన్ని పొందటానికి ప్రయత్నించాడు.
పాకిస్థాన్ ఆర్థిక మంత్రి గులాం అహ్మద్ హైదరాబాద్ సందర్శించినప్పుడు, పాకిస్థాన్‌కు 2-0 కోట్ల అప్పుకు సెక్యూరిటీ ఇవ్వడానికి అంగీకరించాడు.
ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నికాటన్ అనే మధ్యవర్తి ద్వారా బ్రిటన్ వివిధ దేశాల నుండి ఆయుధాలను సమకూర్చుకోవడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు.
నోట్: ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినది వందేమాతరం రాంచంద్రరావు
గోల్కొండ, చాదర్‌ఘాట్, మోతీమహల్ ప్రాంతాలలో ఆయుధ కర్మాగారాలు స్థాపించాడు.
ఉల్లంఘనలతో హైదరాబాద్ సంస్థానంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి.

నిజాంపై బాంబు దాడి

నిజాం విధానాలతో విసిగి పోయిన వ్యక్తి నారాయణ పవార్
డిసెంబర్ 4, 1947న కింగ్ కోఠి వద్ద నిజాంను హతమార్చడానికి నిజాంపై బాంబుదాడి చేసినది.
1. నారాయణరావు పవార్
2. జగదీశ్ ఆర్య
3. గండయ్య
ఈ బాంబు దాడి నుండి నిజాం తృటిలో తప్పించుకున్నారు.
ఈ దాడిలో 12 మంది నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
నారాయణరావు పవార్, గండయ్య పట్టుబడ్డారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 7వ నిందితుడిగా ఉన్నారు.
వీరు ఆగస్టు 10, 1949న విడుదలయ్యారు.
నారాయణరావు పవార్‌కి సోలాపూర్‌లో శిక్షణ ఇప్పించి బాంబుదాడికి ప్రోత్సహించినవారు కొండా లక్ష్మణ్ బాపూజీ.
నారాయణపవార్‌కి తెలంగాణ భగత్‌సింగ్ అని పేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News