- Advertisement -
హైదరాబాద్ : నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఇది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో సంవత్సరాలుగా పడి ఉంది. కాగా హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు ఈ ప్రైవేటు పంప్‌ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి రోజు ఎంతోమంది ఉదయం ఈ పార్కుకు వాకింగ్ తదితర వాహ్యాళికి వస్తున్నా.. రాజు అల్లూరి అనే వ్యక్తి దీనిని ఇటీవలే గుర్తించారు. అటు డివిజినల్ అటవీ అధికారి రూపొందించిన పార్కు మేనేజ్‌మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంప్ నేపథ్యాన్ని
అధికారులు కనుగొన్నారు.
- Advertisement -