Wednesday, January 22, 2025

డిగ్రీ స్టూడెంట్ ని చంపేసిన ఇంటర్ కుర్రాళ్లు

- Advertisement -
- Advertisement -

బోధన్: శ్రద్ధగా చదువుకొమ్మని చెప్పిన డిగ్రీ విద్యార్థిని ఇంటర్ కుర్రాళ్లు కొట్టి చంపిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బోధన్‌లోని బిసి వసతి గృహంలో వెంకట్ అనే డిగ్రీ విద్యార్థి స్టడీ అవర్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. ఆదివారం రాత్రి స్టడీ అవర్ జరుగుతుండగా కొందరు విద్యార్థులు అల్లరి చేస్తుండడంతో చదువుకోవాలని పలుమార్లు సూచించడు. ఇది నచ్చని ఆరుగురు విద్యార్థులు ఆదివారం రాత్రి గదిలో నిద్ర పోతున్న వెంకట్‌పై దాడి చేశారు. అనంతరం అతడి గొంతు నులిమి హత్య చేసి పారిపోయారు. గదిలో నుంచి శబ్దాలు వినపడడంతో మిగితా విద్యార్థులు అక్కడకెళ్లి చూడగా వెంకట్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News