Saturday, December 21, 2024

పెళ్లి వేడుకలో మటన్ ముక్కల కోసం కొట్టుకున్నారు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: పెళ్లి వేడుకలో మటన్ పెట్టలేదని వరుడు, వధువు బంధువులు కొట్టుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… నంది పేటకు చెందిన యువకుడు, నవీపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పేళ్లి వేడుక నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో జరిగింది. విందులో వరుడు తరపు బంధువులకు మటన్ తక్కువగా వేశారని వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో వరుడు, వధువు బంధువులు కర్రలు, గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఎనిమిది మందిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News