Wednesday, January 22, 2025

సూటిపోటి మాటలతో వేధింపులు…. దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: దంపతులను బంధువులు సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేయడంతో ఆ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హెగ్డొలికి గ్రామానిక చెందిన అనిల్ అనే యువకుడు(28), పొతంగల్ గ్రామానికి చెందిన శైలజను(24) సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. శైలజ ఒక తప్పు చేయడంతో భర్త క్షమించాడు. కానీ బంధువులు దుష్ప్రచారం చేయడంతో పాటు సూటిపోటి మాటలతో మానసిక వేధింపులకు గురి చేశారు. దీంతో ఇంటర్య్వ్యూకు వెళ్తున్నామని ఇద్దరు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. తమపై బంధువులు దుష్ప్రచారం చేయడంతో మానసిక వేదనతో గోదావరి నదిలో దూకి చనిపోతున్నామని కోటగిరి ఎస్‌ఐ సందీప్‌కు శైలజ వీడియో పంపింది.

వెంటనే ఆయన నవీపేట ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌కు వీడియోతో పాటు సెల్‌ఫోన్ నంబర్ పంపారు. వెంటనే బాసరలోని గోదావరి నది వద్దకు వెళ్లి చూడగా వారు కనిపించలేదు. ఫోన్ లోకేషన్ ఆధారంగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్టు తెలిసింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా పట్టాలపై మృతదేహాలు కనిపించాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News