Wednesday, January 22, 2025

స్నేహం ముసుగులో వరుస హత్యలు: నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ తో సహా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఎస్ పి చెప్పిన వివరాల ప్రకారం… మాక్లూరు మండలంలోని మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్, విష్ణు, వంశీ అనే ముగ్గురు నవంబర్ 29న ప్రసాద్ ను బండరాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత ప్రశాంత్… ప్రసాద్ ఇంటికి వచ్చి అతని భార్య శాన్వికను కలిశాడు. ప్రసాద్ జైలులో ఉన్నాడని, అతన్ని కలుద్దామని తీసుకువెళ్లి, బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుల సాయంతో ఆమెను చంపి, గోదావరిలో పడేశారు. అదే రోజు ప్రసాద్ చెల్లెలు శ్రావణికి కూడా మాయమాటలు చెప్పి, వడియారం వద్ద ఆమెను హతమార్చి, మృతదేహాన్ని తగులబెట్టారు.

అంతటితో దుండగులు ఆగలేదు. ప్రసాద్ తల్లిని, పిల్లలను, మరో చెల్లిని కూడా మాయమాటలు చెప్పి నిజామాబాద్ తీసుకువెళ్లారు. డిసెంబర్ 4న పిల్లల్ని చంపి, మృతదేహాలను డోన్ వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్ 13న ప్రసాద్ చెల్లెలు స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ప్రశాంత్ పై అనుమానం వచ్చి ప్రసాద్ తల్లి సుశీల లాడ్జినుంచి తప్పించుకుని పారిపోయింది.

కామారెడ్డి జిల్లా పాల్వంచలో ప్రశాంత్ ను, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, ప్రసాద్ కుటుంబ సభ్యుల ఫోన్లను ప్రశాంత్ నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సింధు శర్మ చెప్పారు. ప్రసాద్, అతని భార్య మినహా మిగిలిన మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News