Monday, January 20, 2025

నిజామాబాద్‌లో బోల్తాపడిన డిసిఎం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

వర్ని: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్లారం అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్ గ్రామానికి చెందిన 30 మంది భక్తులు డిసిఎంలో వెళ్తుండగా కొత్తకోట శివారులో వారి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News