Tuesday, December 24, 2024

అమెరికా రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీంగల్ గ్రామానికి గుర్రపు శైలేష్ (23) అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్రపు శైలేష్ గతేడాది 2022 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి బయో మెడికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

శనివారం తన కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సైల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వేగంగా వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో గుర్రపు శైలేష్ సజీవ దహనమయ్యాడు. తండ్రి సత్యం గల్ఫ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చారు. తల్లి గృహిణి కాగా మృతుడి చెల్లెలు ఇద్దరు ప్రస్తుతం ఉన్నత చదువు చదువుతున్నారు.
శైలేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సర్పంచ్ ఎర్రోళ్ల సంజీవ్
గ్రామ సర్పంచ్ ఎర్రోళ్ల సంజీవ్ మాట్లాడుతూ ఇటీవల సెప్టెంబర్ నెలలో గుర్రపు శైలేష్ అమెరికా దేశంలో చదువు కోసం వెళ్లాడని తెలిపారు. దురదృష్టకరంగా అక్కడ జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందటం ఎంతో బాధాకరమన్నారు. మృతుడి తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశంలో వెళ్లి వచ్చాడని, కుమారుడి చదువు కోసం ఎనిమిది లక్షల అప్పు చేసి అమెరికాకు పంపించాడని పేర్కొన్నారు. వారిది పేద కుటుంబం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News