Sunday, December 22, 2024

నిజామాబాద్ లో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు…

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెడ్డు సూర్య అనే వ్యక్తి గల్ఫ్‌లో ఉండేవాడు. గత దసరా నుంచి మోర్తాడ్‌లోనే ఉంటున్నాడు. సూర్యకు రాకేష్ అనే స్నేహితుడు ఉన్నాడు. రాకేశ్ హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సూర్య భార్యతో రాకేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మూడు నెలల క్రితం రాకేష్‌తో సూర్య గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. రాకేశ్ తన గ్రామంలో వాటర్ ట్యాంకర్ దగ్గర నిలబడి ఉన్నాడు. అదును చూసి సూర్య కత్తి తీసుకొని రాకేశ్‌ను పలుమార్లు పొడిచాడు. దీంతో అతడు ఘటనా స్థలంలో చనిపోయాడు. నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సూర్య ఇంటికి చేరుకొని ఇల్లును తగలబెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News