- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఎంపీ అరవింద్‌తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భగా అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి ఉన్నారు. అనంతరం వారి మధ్య సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాజకీయాలు సహా రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగినట్లు సమాచారం.
- Advertisement -