Saturday, November 9, 2024

పిఎఫ్‌ఐ కేసు 11మందిపై ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : నిజామాబాద్ పిఎఫ్‌ఐ కేసులో ఎన్‌ఐఏ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి 11 మం దిపై హైదరాబాద్ ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. నిజామాబాద్‌లో జులై 4న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండి యా (పిఎఫ్‌ఐ)పై కేసు నమోదైంది. ఆగస్టు 26న తిరిగి ఎన్‌ఐఎచే కేసు నమోదైంది. పిఎఫ్‌ఐ కేసులో తెలుగు రా ష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. స్పీచ్‌ల ద్వారా యువకులను పిఎఫ్‌ఐ వైపు ఆకర్షితులను చేశారని, పిఎఫ్‌ఐలో చేరాక భారత ప్రభుత్వం పై కుట్రకు శిక్షణ ఇచ్చారని ఎన్‌ఐఎ పేర్కొంది. నిందితులు అబ్దుల్ అహద్, అబ్దుల్ ఖాదర్, షేక్ ఇలియాస్ అహ్మద్, అబ్దుల్ సలీమ్, షేక్ షాదుల్లా, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఉస్మాన్, సయ్యద్ యాహియా సమీ ర్, షేక్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్‌ముబీన్, మహ్మద్ ఇ ర్ఫాన్‌లపై ఐపిసి 120బి, 153ఏతో పాటు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిజామాబాద్‌లో పిఎఫ్‌ఐపై నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఎ దర్యాప్తు చేప ట్టింది. 11మంది నిందితులపై నేరారోపణలు మోపింది. నిందితులపై 120బి, 153 ఎ, యుఎ(పి) 17,18,18ఎ, 18బి సెక్షన్ల్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. తెలంగాణ, ఎపికి చెందిన పలువురిపై అభియోగాలు మోపింది. శిబిర నిర్వాహకుడు అబ్దుల్‌ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై ఛార్జ్ షీట్ వేసింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలు పిఎఫ్‌ఐ చేస్తున్నట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పిఎఫ్‌ఐ సంస్థలో బలవం తంగా చేర్చుకున్నట్లు పేర్కొంది. పిఎఫ్‌ఐలో రిక్రూట్ అ యిన తర్వాత, ముస్లిం యువకులను యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిగినర్స్ కోర్సు ముసుగులో దాడు లుపై శిక్షణ ఇవ్వడం చేస్తోంది.

కత్తి, కొడవలి, ఇనుప రాడ్లతో ఎలా దాడులు చేయాలో పిఎఫ్‌ఐ శిక్షణలో నేర్పి స్తుంది. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఎ పేర్కొంది. సున్నిత ప్రాం తంలో ఏవిధంగా దాడులు చేయాలో పిఎఫ్‌ఐ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మార్షల్ ఆర్ట్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించింది. పిఎఫ్‌ఐ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఎన్‌ఐఎ వెల్లడిం చింది. ఎఫ్‌ఐ సంస్థను భారత ప్రభుత్వం నిషేధిం చింది.
పక్కా ఆధారాలతో…
నిజామాబాద్ జిల్లా కేంద్రంగా యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ పేరిట ఉగ్రవాద కార్యకలాపాలనను పిఎఫ్‌ఐ సాగిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పక్కా ఆధారాలతో అభియోగాలను నమోదు చేసింది. నిందితుడు అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలోనే పిఎఫ్‌ఐ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానించిన ఎన్‌ఐఏ ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, డిఐజి ఆధ్వర్యం లో ఓ బృందం లోతుగా దర్యాప్తు జరిపి, అనేక మంది అనుమానితులను గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపి పిఎఫ్‌ఐ గుట్టును రట్టుచేసింది. 28 మందిని నిజామాబాద్, బోధన్, కామారెడ్డి ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకొని విచారించింది.
అబ్దుల్ ఖాదరే కీలకం
పిఎఫ్‌ఐ కార్యకలాపాలు విస్తరించడం అబ్దుల్ ఖాదరే కీల కంగా వ్యవహరించినట్లు ఎన్‌ఐఆర్ చార్జీషీట్‌లో పే ర్కొం ది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి చెందిన అబ్దు ల్ ఖాదర్ సుదీర్ఘకాలంగా గల్ఫ్ దేశాలలో పనిచేసి, ఆర్థికంగా బలపడిన తర్వాత ఆయన జగిత్యాలలోని ఆస్తులను అమ్మేసి, నిజామాబాద్‌కు మకాం మార్చాడు. స్థాని క ఆటోనగర్ ప్రాంతంలో ఓ ఇల్లు తీసుకొని చాప కింద నీరులా పిఎఫ్‌ఐ కార్యకలాపాలు విస్తరిస్తూ వచ్చా డు. అయితే మరో రెండు దఫాలుగా ఛార్జిషీట్ వేసే అవకాశం ఉందని సమాచారం. అబ్దుల్ ఖాదర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన ఎన్‌ఐఎ దేశ వ్యాప్తంగా ఉన్న పిఎఫ్‌ఐ డొంకలు కదిలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News