Friday, December 27, 2024

నిజామాబాద్ వాసికి బ్రిటిష్ సిబిఇ పురస్కారం

- Advertisement -
- Advertisement -

భారతీయ మూలాలు ఉన్న లండన్ డాక్టర్ చంద్రమోహన్ కు ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సిబిఇ) పురస్కారం లభించింది. వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.

డాక్టర్ చంద్రమోహన్ నిజామాబాద్ జిల్లావాసి. ఆయన తల్లిదండ్రులు దామోదరరావు, సరోజిని. నిజామాబాద్ కు సమీపంలోని ధర్మారం గ్రామంలో చంద్రమోహన్ జన్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసం జిల్లాలోనే పూర్తి చేసి, హైదరాబాద్ లో ఇంటర్, గుంటూరులో ఎంబీబీఎస్ చదివారు. 2002లో లండన్ వెళ్లి, ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చంద్రమోహన్ బ్రిటన్ డాక్టర్ల అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News