Monday, December 23, 2024

యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరికి పట్టపగలే హత్యకు దారి తీసింది. ఐదవ టౌన్ ఎస్‌హెచ్‌వో సాయినాథ్ కథనం ప్రకారం….. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ ప్రాంతానికి చెందిన షేక్ అర్బజ్ ఒక కారు విషయంలోనే బాబాన్‌సాహెబ్ పహడ్‌కు వెళ్ళి సోహెల్‌తో గొడవ పెట్టుకున్నాడు. స్థానికులు సర్ది చెప్పడంతో ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ గొడవకు సంబంధించి రాజీ కుదిర్చుకుందామని నమ్మించి షేక్ అర్బజ్‌ను అతని స్నేహితులను అసద్ బాబానగర్‌కు రప్పించారు.

అప్పటికే కత్తులు, ఇనుప రాడ్లతో సోహెల్ ఖాజా, హుస్సేన్ సర్వారాజ్ హాజీలతో పాటు మరో పది మంది మాటు వేసి ఉన్నారు. షేక్ అర్బజ్ అతని స్నేహితులు రాగానే సోహెల్ మూకుమ్మడిగా దాడి చేశారు. అర్బజ్‌ను కత్తులతో పొడిచారు. అజర్, అజీమ్, అదీల్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో షేక్ అర్బజ్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఐదవ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు షేక్ అర్బజ్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌హెచ్‌వో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News