Wednesday, January 22, 2025

నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్‌లో నిజాం సాగర్ కాలువ సోమవారం తెల్లవారుజామున తెగిపోయింది. కాలువ కట్ట తెగిపోవడంతో ఈ కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడి జర్నలిస్ట్ కాలనీలోని ఇళ్లలో నీరు చేరడంతో జిల్లా పరిషత్ దాదన్నగారి విటల్‌రావు సోమవారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్, ఇంజనీరింగ్ శాఖ అధికారులకు చూసుకోవాలని అన్నారు. కాల్వ పనులు త్వరలో చేపడతామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. జరిగిన సంఘటనను జిల్లా పరిపాలన అధికారికి తెలియజేస్తానని, ప్రభుత్వం తరపున జరిగిన నష్టాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News