Monday, January 20, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో దిగువకు 6 గేట్ల ద్వారా మంజీరాలోకి నీటిని విడుదల చేస్తున్నారు. 1405 అడుగులకు గాను 1404.66 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 17.311 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయగా, పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. 6 గేట్లను ఎత్తివేయడంతో ఉమ్మడి మండలాలతో పాటు పక్కనే గల సంగారెడ్డి జిల్లా, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు ప్రాజెక్టుకు చేరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News