Monday, December 23, 2024

జనగాం మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసి అనుమతి

- Advertisement -
- Advertisement -

100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) అనుమతి మం జూరు చేసింది. జనగాం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023 -24 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఈ మెడికల్ కాలేజీలో 100 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగా మ,కామారెడ్డి,కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది.

వీటిలో ఇటీవల అసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసి అనుమతులు రాగా, తాజాగా అనుమతి ఇచ్చిన జనగాం మెడికల్ కాలేజీతో కలిపి ఎన్‌ఎంసి అనుమతులు పొందిన వైద్య కళాశాలలు ఐదుకు చేరాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీల అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News